తిరుమల, 15 ఆగస్టు (హి.స.)
: వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుములలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండాయి. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సు, నారాయణగిరి షెడ్లు నిండిపోవడంతో భక్తులను ఆక్టోపస్ భవనం నుంచి క్యూ లైన్‌లోకి అనుమతిస్తు్న్నారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా తితిదే సిబ్బంది అన్నప్రసాదాలు, నీరు, పాలు అందిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ