హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా,
రాహుల్ గాంధీల కుటుంబ నేపథ్యంపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు సోనియా, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారని, లేనివి ఉన్నట్లు మాట్లాడి గాంధీ కుటుంబంపై బురద జల్లడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. త్యాగాల చరిత్రే లేని బీజేపీ, త్యాగాల కుటుంబం పై నిందలు వేయడం బాధాకరమైన అంశం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా వాళ్ల తల్లిదండ్రులను అడిగితే గాంధీ కుటుంబం గొప్పతనం చెప్తారని విమర్శించారు. ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. వారసత్వం ఎలా ఉంటుందో తెలియదా? అని ప్రశ్నించారు. భర్త ఏ కులం అయితే భార్య ది అదే కులం అవుతుందనే తెలివి కూడా లేదా? అని నిలదీశారు. రాహుల్ గాంధీ కుటుంబం.. కాశ్మీర్ బ్రాహ్మణ కుటుంబం అని స్పష్టం చేశారు.
ఈ దేశ మహిళలనే అని సోనియా గాంధీ నీ దేశ ప్రజలు కూడా ఒప్పుకున్నారని తెలిపారు. రాజీవ్ గాంధీ చనిపోయాక సోనియా ఏడేళ్లు అజ్ఞాత జీవితం గడిపారని తెలిపారు. ప్రజలు కోరుకుంటేనే సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్