తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయింది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.) పంద్రాగస్టు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయిందని, తన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన స్వాతంత్ర
కేటీఆర్


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)

పంద్రాగస్టు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయిందని, తన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొని, జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో రాష్ట్రాలు కలిగి ఉన్న వైవిధ్య భారతానికి స్వాతంత్రం సిద్ధించి 79 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తరపున బీఆర్ఎస్ తరపున హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం బలిపీఠం ఎక్కిన వేలాది మంది త్యాగధనులకు, ఆనాటి నాయకత్వానికి వినమ్ర పూర్వక శ్రద్ధాంజలి. 14 రాష్ట్రాలతో మొదలైన స్వతంత్ర భారతదేశ ప్రయాణం ఇవ్వాళ 28 రాష్ట్రాల వైవిధ్య భారతంగా విలసిల్లుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande