ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతున్న భారత్: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ, నల్గొండ. 15 ఆగస్టు (హి.స.) ప్రపంచంలోనే భారత్ అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతున్నదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్రం కోసం లక్షల మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. స్వాతంత్య్ర ఫలాలను భావి భారత పౌ
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి


తెలంగాణ, నల్గొండ. 15 ఆగస్టు (హి.స.) ప్రపంచంలోనే భారత్ అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతున్నదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్రం కోసం లక్షల మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. స్వాతంత్య్ర ఫలాలను భావి భారత పౌరులకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. మన కోసం మనం ఎంత ఆలోచిస్తామో దేశం కోసం కూడా ఆలోచించి దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలన్నారు. మన ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు స్వాతంత్య్ర ఫలాలు అందించాలని చెప్పారు.

ప్రతి ఒక్కరూ కర్తవ్యంగా పని చేసినట్లయితే రాబోయే రోజుల్లో మన దేశం ప్రపంచంలోనే అగ్రగామి అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. దేశ స్వాతంత్య్రం కోసం లక్షల మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. దేశ భవిష్యత్తు బాలలపైనే ఉందని, బాలలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. స్వాతంత్ర ఫలాలను భావిభారత పౌరులకు అందించాల్సిన కర్తవ్యం ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande