అత్యధిక మరణాలు క్యాన్సర్ వల్లే..! ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.) అత్యధిక మరణాలు క్యాన్సర్ వల్ల వస్తున్నాయని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం టెస్ట్ చేసుకుంటే తప్ప బయటపడే ప్రసక్తి లేదు కాబట్టి మనం తప్పకుండా ఈ క్యాన్సర్ స్క్రీన్ టెస్ట్ చేసుకోవాలని స
MP Etela


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)

అత్యధిక మరణాలు క్యాన్సర్ వల్ల వస్తున్నాయని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం టెస్ట్ చేసుకుంటే తప్ప బయటపడే ప్రసక్తి లేదు కాబట్టి మనం తప్పకుండా ఈ క్యాన్సర్ స్క్రీన్ టెస్ట్ చేసుకోవాలని సూచించారు. శుక్రవారం ఉప్పల్లోని బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ నిర్వహించిన క్యాన్సర్ పై అవగాహన, ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు కరోనా టైమ్ కాబట్టి సంపూర్ణంగా పని చేసే అవకాశం లేకపోయిందని తెలిపారు. ఎంఎన్నో, నిమ్స్ హాస్పిటల్స్లో లేటెస్ట్ పరికరాలను తీసుకొచ్చి పెట్టామని, సీఎస్ఆర్ ఫండ్ కింద రూ.40 కోట్లతో కొత్త హాస్పిటల్ కట్టించామని గుర్తుకుచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande