జాతిపిత మహాత్మాగాంధీ జీ కి.కడపతో.ఎంతో అనుబంధముంది
అమరావతి, 15 ఆగస్టు (హి.స.) కడప, చిన్నచౌకు, : జాతిపిత మహాత్మా గాంధీజీకి కడపకు ఎంతో అనుబంధముంది. 1919-20 ప్రాంతంలో ఆయన రాయలసీమలో పర్యటించారు. ఆ సమయంలో కడపకు వచ్చారు. నగరంలోని రామసుబ్బారెడ్డి గృహంలో రెండు రోజులు బస చేశారు. గాంధీజీని చూసేందుకు నలుమూలల న
Tiranga


అమరావతి, 15 ఆగస్టు (హి.స.)

కడప, చిన్నచౌకు, : జాతిపిత మహాత్మా గాంధీజీకి కడపకు ఎంతో అనుబంధముంది. 1919-20 ప్రాంతంలో ఆయన రాయలసీమలో పర్యటించారు. ఆ సమయంలో కడపకు వచ్చారు. నగరంలోని రామసుబ్బారెడ్డి గృహంలో రెండు రోజులు బస చేశారు. గాంధీజీని చూసేందుకు నలుమూలల నుంచి వేల మంది ఇక్కడికి అప్పట్లో తరలివచ్చారు. గాంధీ బస చేసిన భవనాన్ని ఇప్పటికీ ‘హౌస్‌ ఆఫ్‌ కడప గాంధీ’ అని వ్యవహరిస్తుంటారు. కడప వచ్చిన సమయంలోనే మాసాపేటలోని ఆలయాన్ని కూడా మహాత్ముడు సందర్శించారు. ఈ భవనంలో ప్రస్తుతం ఆసుపత్రి నడుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande