సంగారెడ్డి, 15 ఆగస్టు (హి.స.)
సంగారెడ్డి జిల్లా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. శుక్రవారం 9వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని పోలీసు పెరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజల నుద్దేశించి మంత్రి దామోదర మాట్లాడుతూ నెహ్రూ, ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగుతున్నదన్నారు. పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత నైపుణ్యంతో కూడిన ఉపాధి, అర్హత ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా అన్ని రంగాలలో సమగ్రమైన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్