భద్రాద్రి కొత్తగూడెం. 15 ఆగస్టు (హి.స.)
వేలాది మంది త్యాగధనుల ప్రాణ
త్యాగంతోనే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదాన్ లో నిర్వహించిన 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పోలీసులు మంత్రిని గౌరవంగా ఆహ్వానించారు. మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన వేలాది మంది అమరుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని, మహాత్మా గాంధీ నాయకత్వంలో సాగిన పోరు బాటలో నేల కొరిగిన అమరులకు నివాళి అర్పిస్తూ జిల్లా ప్రజలకు 79 వ భారత దేశ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్