అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట, 15 ఆగస్టు (హి.స.) అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య యువజన క్రీడా సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో మంత్రి
మంత్రి శ్రీహరి


నారాయణపేట, 15 ఆగస్టు (హి.స.)

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య యువజన క్రీడా సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో మంత్రి వాకిట శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, ఎస్పీ యోగేష్ గౌతమ్ లతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయా శాఖల అధికారులకు సిబ్బందికి ప్రశంస పత్రాలను అందించారు. అలాగే పోలీసులకు ఉత్తమ, సేవ పథకాలను అందజేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు. తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. జిల్లాను, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్లేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande