ప్రభుత్వపథకాల ఫలాలు అర్హులందరికి అందేలా చూడాలి.. పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు
పెద్దపల్లి, 15 ఆగస్టు (హి.స.) ప్రజలకు అందుబాటులొ ఉంటూ వారికి అవసరమైన పనులు చేస్తేనే ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఆదరిస్తారని ఆ దిశగా స్థానిక నాయకులు, కార్యకర్తలు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజ
పెద్దపల్లి ఎమ్మెల్యే


పెద్దపల్లి, 15 ఆగస్టు (హి.స.)

ప్రజలకు అందుబాటులొ ఉంటూ వారికి అవసరమైన పనులు చేస్తేనే ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఆదరిస్తారని ఆ దిశగా స్థానిక నాయకులు, కార్యకర్తలు అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని సబ్బితంలో శుక్రవారం పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో పాటు అటవీశాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రూ.54 లక్షల వ్యయంతో నిర్మించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నివాస భవనాలను ప్రారంభించి గృహ ప్రవేశ పూజలు చేశారు.

అనంతరం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో స్థానిక నాయకుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తూనే ఇక ముందు అలా జరుగకుండా చూసుకోవాలని అర్హులందరికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని, ఏవైనా ఇబ్బందులుంటే నా దృష్టికి తీసుకురావాలని సంబంధిత అధికారులతో మాట్లాడి అట్టి సమస్యలు పరిష్కరించేలా చూస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande