ఐఏఎస్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ..
భద్రాద్రి కొత్తగూడెం, 15 ఆగస్టు (హి.స.) పంద్రాగస్టు రోజు భద్రాచలం ఐ టీ డీ ఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ భార్య మనీషా రాహుల్ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐఏఎస్ అధికారి అయినా... సాధారణ వ్యక్తి లాగా కాన్పు కోసం తన భార్యను ప్ర
ఐఏఎస్ భార్య


భద్రాద్రి కొత్తగూడెం, 15 ఆగస్టు (హి.స.)

పంద్రాగస్టు రోజు భద్రాచలం ఐ టీ డీ ఏ

ప్రాజెక్ట్ అధికారి రాహుల్ భార్య మనీషా రాహుల్ ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐఏఎస్ అధికారి అయినా... సాధారణ వ్యక్తి లాగా కాన్పు కోసం తన భార్యను ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం జాయిన్ చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యున్నత వైద్య సేవలు అందుతున్నాయని తెలిపేందుకు ఇది ఉదాహరణగా నిలుస్తుంది.

కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భార్య శ్రద్ధ కూడా గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ జరుపుకొని మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం గమనార్హం..

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande