నంద్యాల.తిరుపతి.జాతీయ. రహదారి పై తెల్లవారుజామున.రెండు. ప్రైవేట్ బస్సులు. ఢీ- ఇద్దరు, మృతి
ఆళ్లగడ్డ, , 15 ఆగస్టు (హి.స.) : నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి హైదరాబాద్
నంద్యాల.తిరుపతి.జాతీయ. రహదారి పై తెల్లవారుజామున.రెండు. ప్రైవేట్ బస్సులు. ఢీ- ఇద్దరు, మృతి


ఆళ్లగడ్డ, , 15 ఆగస్టు (హి.స.)

: నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న రెండు బస్సులు మార్గంమధ్యలో ఆళ్లగడ్డ వద్ద ఆల్ఫా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న జగన్ ట్రావెల్స్‌ బస్సును వెనుక నుంచి శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సులో ఉన్న ఇద్దరు, జగన్‌ ట్రావెల్స్ బస్సులో ఉన్న ఒకరు మృతిచెందారు. మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పొక్లెయిన్‌ సాయంతో బయటకు తీశారు. మరణించిన వారు ఎవరనేది తెలియాల్సి ఉంది.. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande