హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)
దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ పోలీసులకు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల చెక్ అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరైన రాహుల్ సిప్లిగంజ్.. సీఎం చేతుల మీదుగా రూ. కోటి చెక్ నగదు ప్రోత్సాహకం అందుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్కు సీఎం విషెస్ తెలిపారు. కాగా, ఇటీవల పాతబస్తీ బోనాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాహుల్కు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రంలో తను పాడిన 'నాటు నాటు' సాంగ్కు ఆస్కార్ అవార్డు రావడంతో దేశవ్యాప్తంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాపులర్ అయ్యారు. ఆ ఒక్క పాటతో ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్