తిరుమల, 15 ఆగస్టు (హి.స.)అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులు ముందుగానే వారు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందునా శ్రావణ మాసం, కార్తీక మాసం వంటి నెలల్లో శ్రీవారి దర్శనం అంటే తప్పనిసరిగా దర్శనం, బస వంటి సౌకర్యాలు ముందుగానే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో నవంబర్ నెలకు సంబంధించి టీటీడీ దర్శనాల, గదుల కోటా బుకింగ్ రిలీజ్ తేదీలను ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నవంబర్ కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం ఆగస్ట్ 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపింది. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. నవంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఏమిటంటే..
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబర్ నెల కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి