శ్రీశైలం, 15 ఆగస్టు (హి.స.)ఏపీ(Andhra Pradesh)లో ప్రముఖ జ్యోతిర్లింగా పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్తులకు ఆలయ అధికారులు కీలక ప్రకటన చేశారు. శ్రీశైలంలో కొలువైన మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ఈ క్రమంలో కొన్ని సార్లు భక్తుల రద్దీ సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీశైలం మల్లన్న ఆలయ అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో స్పర్శ దర్శనాలు నిలిపివేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి