విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగరవేసిన చంద్రబాబు
అమరావతి, 15 ఆగస్టు (హి.స.)విజ‌య‌వాడ‌లోని మున్సిప‌ల్ స్టేడియంలో జ‌రుగుతున్న 79వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు హాజ‌ర‌య్యారు. జాతీయ జెండాను ఎగ‌ర‌వేసి పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ఉన్నతాధికారులు, అధి
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగరవేసిన చంద్రబాబు


అమరావతి, 15 ఆగస్టు (హి.స.)విజ‌య‌వాడ‌లోని మున్సిప‌ల్ స్టేడియంలో జ‌రుగుతున్న 79వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు హాజ‌ర‌య్యారు. జాతీయ జెండాను ఎగ‌ర‌వేసి పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ... ఈస్ట్ లో లాజిస్టిక్ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను నిలబెడతామని అన్నారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిలబెట్టడమే లక్ష్యం అని చెప్పారు.చెత్త నుండి సంపద సృష్టి అనే కార్య‌క్ర‌మం చేప‌డ‌తామ‌ని అన్నారు. ప‌ట్టు ప‌రిశ్ర‌మ‌కు దిశా నిర్దేశం చేస్తామ‌ని చెప్పారు.

పీ4 మోడ‌ల్‌తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కొత్త అడుగు పడిందన్నారు. స్వర్ణాంధ్ర 2027 పెట్టుబడులకు మొదటి ఎంపిక అని స్పష్టం చేశారు. దీపం 2 పథకం పేదల జీవితాలలో వెలుగులు నింపుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. రియల్ టైమ్ డేటాతో సమర్దవంతంగా, వేగంగా పాలన జరుగుతోందని అన్నారు. అంతే కాకుండా తాము అధికారంలోకి వచ్చిన తరవాత పోలవరం, హంద్రీనా ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం రోడ్డులకు గుంతలు కూడా పూడ్చలేదని విమర్శించారు. బీసీలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. పేదల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande