బెంగళూరు:15 ఆగస్టు (హి.స.) దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిమాని రేణుకా స్వామి హత్యకేసులో గురువారం కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగుదీప ప్రియురాలు పవిత్రా గౌడ మరో సారి అరెస్ట్ అయ్యారు.
రేణుకా స్వామి హత్యకేసులో ఏ1 నిందితురాలు పవిత్రా గౌడకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను.. గురువారం సుప్రీంకోర్టు రద్దు చేసింది. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో.. పోలీసులు నటి సప్తమిగౌడను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఇదే హత్యకేసులో ఏ2గా ఉన్న దర్శన్ బెయిల్‌ను ఇవాళ సైతం దేశ అత్యున్నత న్యాయ స్థానం రద్దు చేసింది. బెయిల్ రద్దుతో పోలీసులు అతనిని అరెస్ట్ చేయగా.. కొద్ది సేపటి క్రితమే ఆర్ఆర్ నగర్‌లో ఉన్న పవిత్రగౌడను అదుపులోకి తీసుకున్న పోలీసులు జైలుకు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ