కాకినాడి, 15 ఆగస్టు (హి.స.)ఆంధ్ర ప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం సమంగా ముందుకు సాగుతుంది, ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్పథకాలను అమలు చేస్తూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తెలిపారు. కాకినాడ పరేడ్ గ్రౌండ్ లో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల మాతృమూర్తులకు 8,745 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. దీపం2 పథకం కింద ఇప్పటికీ 2 విడతలుగా కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు, 5 ఏళ్ళలో ఏడాదికి 3 సిలిండర్ల చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయా ణం ప్రారంభిస్తున్నాం అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకు 100 నుంచి 10,000 కి, మేజర్ పంచాయితీలకు 250 నుండి 25,000 కి పెంచి సర్పంచుల ఆత్మ గౌరవాన్ని కాపాడాం అన్నారు. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకేరోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి