హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)
దివంగత మాజీ సీఎం శిబూ సోరెన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. జార్ఖండ్ రాష్ట్రం రామ్గఢ్ జిల్లాలోని నెమ్రా గ్రామంలో గురువారం దివంగత జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ సంస్మరణ సభలో ఆయన పాల్గొని నివాళులు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం హేమంత్ సోరెన్ భార్య , ఎమ్మెల్యే కల్పనా సోరెన్, కుటుంబ సభ్యులను కలిసి ఆయన సంతాపం తెలిపారు. అనంతరం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో సీఎం రేవంత్ రెడ్డి కాసేపు మాట్లాడారు.
కాగా, ఈ నెల 4న జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుల్లో ఒకరైన శిబూ సోరెన్ (81) కన్నుమూశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్