రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్ పాలన.. నిరంజన్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.) రైతుల పాలిట కాంగ్రెస్ పాలన శాపంగా మారిందని రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలను ఈ దేశ ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ని
నిరంజన్ రెడ్డి


హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)

రైతుల పాలిట కాంగ్రెస్ పాలన శాపంగా మారిందని రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలను ఈ దేశ ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ నినాదాల ద్వారా ఈ దేశం అభ్యున్నతి, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా కట్టుబడి పనిచేయాలో, రైతు శ్రేయస్సు, వ్యవసాయరంగం ఎంత కీలకమైందో స్వాతంత్య్ర ఫలాలు అందుకోవడం అంటే వ్యవసాయరంగ అభివృద్ధి అని ఆ స్ఫూర్తి యొక్క లక్ష్యం. ఈ నినాదం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ సంధర్భంగా జరుగుతున్న 79వ స్వాతంత్య్ర వేడుకల సమయంలో జై కిసాన్లు నై యూరియా అని రోడ్ల మీదకు వచ్చి చెప్పులు లైన్లో పెట్టి ఒక్క బస్తా యూరియా కోసం పాట్లు పడుతున్నారు. ఆధార్ కార్డులు తీసుకుని వెళ్లి రోజుల తరబడి లైన్లో ఉంటే భార్యాభర్తలకు కలిపి ఒక్కటే బస్తా యూరియా ఇస్తున్నారు అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande