హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)
సంప్రదాయం, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా, మాజీ రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సీడ్ గణపతి విగ్రహాలను తెలుగు నటుడు, నిర్మాత నారా రోహిత్ శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంతోష్ కుమార్ స్వర్ణగిరి టెంపుల్లో భక్తులకు, సిబ్బందికి సీడ్ గణపతి విగ్రహాలను అందజేశారు. గణేష్ చతుర్థి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో, ఈ పర్యావరణ హిత కార్యక్రమం 5,000 అందమైన సీడ్ గణేశ విగ్రహాలను పిల్లలకు, కుటుంబాలకు, సందర్శకులకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. .
సీడ్ గణేశ విగ్రహాలు సహజ మట్టి, కొబ్బరి పొట్టు పొడి, కొబ్బరి పొడి పొరలతో తయారు చేసి, చింత, వేప వంటి స్థానిక చెట్ల విత్తనాలను పొదిగించబడ్డాయి. భక్తులు గణేశ్ చతుర్థి పూజ అనంతరం ఈ విగ్రహాలను మట్టిలో లేదా కుండలో ఉంచితే, వాటిలోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా మారతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్