కాలేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం..
జయశంకర్ భూపాలపల్లి, 16 ఆగస్టు (హి.స.) గత రాత్రి నుండి భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో పాటు కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మేడిగడ్డ అన్నారం బ్యారేజీ పూర్తిగా గేట్లు ఎత్త
గోదావరి


జయశంకర్ భూపాలపల్లి, 16 ఆగస్టు (హి.స.) గత రాత్రి నుండి భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో పాటు కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మేడిగడ్డ అన్నారం బ్యారేజీ పూర్తిగా గేట్లు ఎత్తివేశారు. ఉదయం నుంచి గోదారి ఉధృతం కావడంతో భక్తులు ఎవరు గోదారి వద్దకు వెళ్లి స్నానాలు ఆచరించరాదని, గోదావరి నది ఒడ్డున సురక్షితంగా స్నానాలు చేయాలని పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు భక్తులకు సూచించారు. భూపాలపల్లి ఓసీపీలో వరద నీరు వెళ్లడంతో అక్కడ బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. దీంతో సింగరేణికి రోజుకు రెండు కోట్లకు పైగానే నష్టం వాటిల్లుతుంది. మహాముత్తారం మండలం పెగడపల్లి వద్ద పెద్ద వాగు పొంగి ప్రవహించడంతో పెగడపల్లి నుంచి మహాముత్తారం మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా కోనంపేట వద్ద వాగు పొంగిపొర్లడంతో మహముత్తారం నుంచి భూపాలపల్లి వెళ్లే వారు వెళ్లలేకపోతున్నారు. గ్రామాల్లో చిన్న చిన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షానికి పల్లె ప్రజలు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande