ఖమ్మం జిల్లాలో వరద తాకిడి.. రాకపోకలకు అంతరాయం.
తెలంగాణ, 16 ఆగస్టు (హి.స.) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలుమార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పేరుపల్లి సమీపంలోని బుగ్గ వాగుపై ఉన్న వంతెన పైనుంచి నీళ్లు ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలోన
ఖమ్మం జిల్లా


తెలంగాణ, 16 ఆగస్టు (హి.స.)

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలుమార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పేరుపల్లి సమీపంలోని బుగ్గ వాగుపై ఉన్న వంతెన పైనుంచి నీళ్లు ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలోని ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఒడ్డున నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వరద తాకింది. క్రమంగా వరద పెరుగుతుండటంతో కాలనీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. అదేవిధంగా లలితాపురం చెరువు అలుగు పోస్తుండటంతో తొడిదగలగూడెం నుంచి ఇల్లందువైపునకు రావడానికి రాకపోకలు స్తంభించాయి. మాణిక్యారం నుంచి చీమలపాడు వెళ్లే మార్గంలో దిగువ ప్రాంతంలో ఉన్న రోడ్డుపై నుంచి నీళ్లు పారుతుండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

చీమలపాడు రైల్వే స్టేషన్, చింతలపాడు, గాదెపాడు రైల్వే అండర్ బ్రిడ్జిలలో నీళ్లు నిలవడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande