జగిత్యాల, 16 ఆగస్టు (హి.స.)
భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని రేచపల్లి గ్రామంలోని ఊర చెరువు మత్తడిని శనివారం ఆయన పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రేచపల్లి ఊర చెరువు కట్టపై నుండే బీంరెడ్డి గూడెం గ్రామానికి గిరిజనులు వెళ్తుంటారు. చెరువు కట్ట మత్తడి దుంకితే గూడెం వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోతాయి.
రాత్రి నుండి భారీ వర్షం కురడంతో చెరువు పూర్తిగా నిండిపోయి మత్తడి వరకు నీళ్లు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ చెరువును, మత్తడిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువులోకి ఎవరు వెళ్లవద్దని, చెరువు వద్ద ఎవరిని రీల్స్ చేయకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి ప్రవాహం పెరిగితే అవసరమైతై పోలీసులను బందోబస్త్ ఏర్పాటు చేయించాలని ఆదేశించారు.
గ్రామస్తులు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు కూడా నీటి ప్రవాహం ఉన్న చెరువులోకి వెళ్లవద్దని చెప్పారు. ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్