ఆర్ఎస్ఎస్ ను ప్రశంసించడం అంటే స్వాతంత్ర్య దినోత్సవాన్ని అవమానించడమే: కేరళ సీఎం విజయన్
హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.) భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట వేదికగా శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ఆర్ఎస్ఎస్ ను ప్రశంసించడంపై కేరళ సీఎం పినరయ్ విజయన్ శనివారం స్పందించారు. ఈ సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య
కేరళ సీఎం


హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట వేదికగా శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ఆర్ఎస్ఎస్ ను ప్రశంసించడంపై కేరళ సీఎం పినరయ్ విజయన్ శనివారం స్పందించారు. ఈ సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ ను ప్రశంసించడం అంటే.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని, స్వాతంత్ర్య పోరాటాన్ని అవమానించినట్లే అని మండిపడినట్లు కేరళ సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ఎన్ను ప్రధాని ప్రశంసించడం మహాత్మా గాంధీ హత్య తర్వాత నిషేధించబడిన మితవాద సంస్థకు స్వాతంత్ర్యానికి పితృత్వాన్ని ఆపాదించే ప్రయత్నం అని విజయన్ అన్నారు. అలాగే ఎర్రకోట వేదికగా మోడీ చర్యను చరిత్ర తిరస్కరణగా అభివర్ణిస్తూ, రాజకీయాల విషపూరిత చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్ఎన్ను ఇటువంటి హాస్యాస్పద చర్యలు కప్పిపుచ్చలేవని ముఖ్యమంత్రి విజయన్ తన ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande