వరంగల్ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటాం : మంత్రి కొండా సురేఖ
వరంగల్, 16 ఆగస్టు (హి.స.) వరంగల్ ప్రజలకు ఎల్లవేళలా వింటూ అండగా ఉంటామని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. హన్మకొండ రాంనగర్ లోని తమ నివాసంలో శనివారం ప్రజల నుంచి వినతులను విజ్ఞప్తులను స్వీకరించారు. ప్రజల సమస్యలను సావధానంగ
కొండ సురేఖ


వరంగల్, 16 ఆగస్టు (హి.స.) వరంగల్ ప్రజలకు ఎల్లవేళలా వింటూ అండగా ఉంటామని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. హన్మకొండ రాంనగర్ లోని తమ నివాసంలో శనివారం ప్రజల నుంచి వినతులను విజ్ఞప్తులను స్వీకరించారు. ప్రజల సమస్యలను సావధానంగా అప్పటికప్పుడే సంబంధిత శాఖ అధికారులతో మంత్రి మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ప్రజలు ఏ సమస్య ఉన్న ఎవరి వద్దకు వెళ్లి పైరవీలు చేయాల్సిన అవసరం లేదని, నిరభ్యంతరంగా తనను సంప్రదించవచ్చన్నారు.

తమది పేదల ప్రభుత్వమని పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని ఆమె అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేయడమే మా లక్ష్యం అని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీ వర్ష సూచన కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande