హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)
ముంబై లోని వసై-విరార్ సిటీ మున్సిపల్ కార్పొరేషన డిప్యూటీ డైరెక్టర్ (టౌన్ ప్లానింగ్)గా విధులు నిర్వర్తిస్తున్న హైదరాబాద్ వాసి వైఎస్ రెడ్డి ని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ భూములపై అక్రమ నిర్మాణాలకు సంబంధించి మీరా-భయందర్ పోలీసులు దాఖలు చేసిన కేసులో ఆయనను తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఇటీవలే ఈడీ అధికారులు వైఎస్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టగా..రూ.10.27 కోట్ల నగదు, సుమారు 5.23.25 కోట్ల విలువైన వజ్రాలతో కూడిన ఆభరణాలు బంగారం లభించాయి. అదేవిధంగా రూ.13.86 కోట్ల విలువైన బ్యాంక్ బ్యాలెన్స్, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ ఫ్రీజ్ చేసింది. దాదాపు రూ.47 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. కాగా, ఇదే కేసులో ఆగస్టు 13న ఈడీ మాజీ వీవీసీఎంసీ కమిషనర్, ఐఏఎస్ అనిల్ కుమార్ ఖండేరావ్ పవార్ , బిల్డర్, మాజీ బహుజన్ వికాస్ అఘాడీ కార్పొరేటర్ సీతారామ్ గుప్తా, బిల్డర్ అరుణ్ గుప్తాలను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..