అమరావతి, 16 ఆగస్టు (హి.స.), : జాతీయ విద్యా విధానంలో భాగంగా డిగ్రీలోనూ మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థులకు ఉపయోగకరంగా వాటిని రూపొందించారు. నాలుగేళ్ల డిగ్రీ (హానర్స్) ప్రవేశపెట్టడంతో పాటు విద్యార్థుల వెసులుబాటును బట్టి ఒక్కో ఏడాది.. ఒక్కో చోట చదువుకునే వీలు ఉండగా.. పూర్తి చేసిన ఏడాదికి ప్రత్యేకంగా ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆచార్యులు భావిస్తున్నారు. వీఎస్‌యూలోనూ ఈ ఏడాది కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ