ప్రాజెక్టుల పరిసరాలకు ఎవరూ వెళ్లొద్దు : కలెక్టర్ అభిలాష అభినవ్
తెలంగాణ, నిర్మల్. 16 ఆగస్టు (హి.స.) నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం, స్వర్ణ ప్రాజెక్టుల పరిసరాలకు ఎవరూ వెళ్లరాదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రదేశాలకు ఎవరూ వెళ్లవద్దని, ముఖ్
నిర్మల్ కలెక్టర్


తెలంగాణ, నిర్మల్. 16 ఆగస్టు (హి.స.)

నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం, స్వర్ణ ప్రాజెక్టుల పరిసరాలకు ఎవరూ వెళ్లరాదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రదేశాలకు ఎవరూ వెళ్లవద్దని, ముఖ్యంగా పశువుల కాపరులు తమ పశువులను నది-వాగుల దారుల్లోకి తీసుకెళ్లకూడదని కలెక్టర్ సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షణలో భాగంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కడెం, స్వర్ణ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువ గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లోకి చేపలు పట్టేవారు, రైతులు, ఇతరులు వెళ్లకూడదని హెచ్చరించారు. జిల్లా యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉందని, ఎన్డీఆర్ఎఫ్ టీంలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 91005_77132 ను సంప్రదించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande