న్యూఢిల్లీ 16 ఆగస్టు (హి.స.)ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్ రాజకీయాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర యువత కోసం ఒక కోటి ఉద్యోగ అవకాశాలతోపాటు పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించే పథకాలను ప్రకటించారు. 2020లో మొదలైన సాత్ నిశ్చయ్-2 కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 50 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని సీఎం నితీష్ ప్రస్తావించారు.
.
ఇప్పుడు వచ్చే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇవి కేవలం మాటలు మాత్రమే కాదని, పని చేసి చూపించడానికి తీసుకున్న నిర్ణయమని నితీష్ కుమార్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా కంపెనీలు పెట్టే వారికి పలు రకాల ప్రోత్సాహక పథకాలను ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ