హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)
తనకు మంత్రి పదవి రాకుండా
అడ్డుకుంటున్నారు.. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని అన్నారు. ఇప్పటికే తాను క్షమశిక్షణ కమిటీని ఆదేశించాను.. ముందు రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అతి త్వరలోనే రిజర్వేషన్లపై స్పష్టత వస్తుందని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్