హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)
రూ. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ, తొలి రోజే రూ.151 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒకేరోజు ఈ స్థాయిలో గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా 'కూలీ' ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ ఏడాది రజినీకాంత్ సినీ కెరీర్కు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 'కూలీ' రిలీజ్ కావడం, అది ఘనవిజయం సాధించడం అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షల వెల్లువెత్తుతుంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ, చలనచిత్ర ప్రపంచంలో 50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజినీకాంత్గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన పాత్రలు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసాయి. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను,” అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్