హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ పై ప్రశంసలు కురిపించడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. గత కొంత కాలంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు మధ్య గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎర్రకోట ప్రసంగంలో మోడీ నోట ఆర్ఎస్ఎస్ మాట వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. సంఘ్ పెద్దలను మచ్చిక చేసుకోవడం కోసమే ప్రధాని మోడీ ఈ తంటాలు పడుతున్నారని కాంగ్రెస్ విమర్శించింది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్-బీజేపీ మధ్య విభేదాలపై ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత రామ్ మాధవ్ క్లారిటీ ఇచ్చారు.
ఓ న్యూస్ ఎజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఆర్ఎస్ఎస్, బీజేపీ రెండు సంస్థలు అయినప్పటికీ ఒకే సిద్ధాంత కుటుంబానికి చెందినవే అన్నారు. బీజేపీ రాజకీయ రంగంలో పని చేస్తుంటే.. ఆర్ఎస్ఎస్ సమాజ సేవలో ఉందని ఉందన్నారు. ఈ రెండింటి మధ్య ఎటువంటి విభేదాలు లేవనన్నారు. బీజేపీపై మాట్లాడేందుకు ఏమి లేనప్పడు ప్రత్యర్థులు ఇలాంటి విమర్శలే చేస్తారని వ్యాఖ్యానించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..