హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)
*-
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈరోజు ఆగస్టు 16, 2025న సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో వర్షాకాలం దృష్ట్యా ముందస్తు చర్యలపై , ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. . భారీ వర్షాల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి జోన్ సంసిద్ధతను అంచనా వేయడం మరియు నిరంతరాయంగా, సురక్షితమైన రైలు కార్యకలాపాలను నిర్ధారించడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్ మరియు ప్రధాన విభాగాధిపతులు పాల్గొన్నారు. వీరితోపాటు విజయవాడ, గుంతకల్ , గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ మొత్తం ఆరు డివిజన్ల నుండి డివిజనల్ రైల్వే మేనేజర్లు (డి.ఆర్.ఏంలు), అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్లు (ఎ.డి.ఆర్.ఏంలు) మరియు డివిజనల్ ఇంజనీర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
జనరల్ మేనేజర్ సమీక్షకు ముందు విపత్తు నిర్వహణ గదిని తనిఖీ చేసి, 24x7 కార్యాచరణ సంసిద్ధత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సున్నిత ప్రాంతాల నుండి ప్రత్యక్ష ప్రసారాలను ఆయన పర్యవేక్షించారు మరియు ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితుల సమాచారం కొరకు స్థానిక మరియు రాష్ట్ర అధికారులతో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
వర్షాకాలంలో ముంపుకు ఎక్కువగా గురయ్యే వంతెనలు, సొరంగాలు మరియు రోడ్ అండర్ బ్రిడ్జిలు (ఆర్. యూ. బి లు) వంటి సున్నితమైన మౌలిక సదుపాయాల సమీక్షపై ప్రాధాన్యతనిచ్చింది. ఈ సమావేశం ఉన్న కీలక ఆదేశాలలో ఈ దిగువన ఇవ్వబడినాయి:
• 24 గంటలూ అధికారులచే నియంత్రణ మరియు విపత్తు నిర్వహణ కేంద్రాల నిర్వహణ
• అత్యవసర నిల్వలు: త్వరిత ప్రతిస్పందన కోసం ఇసుక, బ్యాలస్ట్, సిమెంట్, బండరాళ్లు మరియు పైపుల లభ్యతను నిర్ధారించుకోవడం.
• నిరంతర పర్యవేక్షణ: కీలక ప్రదేశాలలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం మరియు 24 గంటలూ నిఘా నిర్వహించడం.
• త్వరిత మరమ్మతులు: పెండింగ్‌లో ఉన్న మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయడం లేదా అవసరమైతే తప్ప మిగిలిన వాటిని వాయిదా వేయడం.
• డ్రైనేజీ & పంపింగ్: సునితమైన ప్రదేశాలు, స్టేషన్ యార్డులలో డ్రైనేజీ వ్యవస్థ యొక్క పనితీరును ధృవీకరించడం.
జనరల్ మేనేజర్ వాస్తవ సమయ పరిస్థితులపై అవగాహన కల్పించడానికి భారీ వర్షాల సమయంలో అధికారులు తక్షణమే అప్రమత్తంగా ఉండాలని, పుట్ ప్లేట్ ద్వార పరిశీలన చేయాలని మరియు తక్షణ చర్యలకు వీలు కల్పించాలని సూచించారు. అవరోధాల సమయంలో ప్రయాణీకులకు ఖచ్చితమైన సమాచారం అందించడానికి ప్రధాన స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఆదేశించారు.
పెరిగిన వృక్షసంపద వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించిన జనరల్ మేనేజర్, కార్యాచరణ ప్రమాదాలను నివారించడానికి ట్రాక్‌లు మరియు ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్ (ఓ.ఎచ్.ఈ) అడ్డంకుగా పెరిగిన చెట్లను నరికివేయడం, కత్తిరించడం లేదా నాచ్ చేయడం వంటి చర్యలను చేపట్టాలని సూచించారు. క్షేత్ర స్థాయి పర్యవేక్షకులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్యను వెంటనే పరిష్కరించేలా చూసుకోవాలని ఆయన నొక్కి చెప్పారు.
రుతుపవనాల సంసిద్ధత కేవలం కాలానుగుణ ప్రోటోకాల్ కాదు - ఇది ప్రయాణీకుల భద్రత మరియు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు మన చురుకైన విధానం యొక్క ప్రతిబింబం. ప్రతి పర్యవేక్షకుడు, ప్రతి బృంద సభ్యుడు అత్యవసరంగా మరియు ఖచ్చితత్వంతో వ్యవహరించాలి. అని పేర్కొంటూ, భద్రత మరియు కార్యాచరణ నైపుణ్యం పట్ల దక్షిణ మధ్య రైల్వే యొక్క నిబద్ధతను శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పునరుద్ఘాటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు