తెలంగాణ, ఆదిలాబాద్. 16 ఆగస్టు (హి.స.)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని అతి పెద్దదైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో గత రాత్రి నుండి కురుస్తున్న భారీవర్షాల కారణంగా కడెం ప్రాజెక్ట్ లో భారీగా వరదనీరు చేరుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700వందలు అడుగులు. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా శనివారం కడెం ప్రాజెక్ట్‌కు 87వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద నీరు వచ్చి చేరడంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుకు చెందిన 12 వరద గేట్లను ఎత్తి వేసి ఒక లక్ష 12 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు.ప్రస్తుతం కడం ప్రాజెక్టులో 87వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద నీరు వచ్చి చేరుతుందని, 694.500 అడుగులు నీటిమట్టం ఉందని అధికారులు పేర్కొన్నారు. గోదావరి పరివాహక, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమతంగా ఉండాలని, పశువుల కాపరులు గోదావరి తీరం వైపు వెళ్ళొద్దని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు