పేకాట స్థావరం పై పోలీసుల దాడి.. పట్టుబడ్డ మాజీ సర్పంచ్
సూర్యాపేట, 16 ఆగస్టు (హి.స.) గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరం పై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, మఠంపల్లి పో
పేకాట


సూర్యాపేట, 16 ఆగస్టు (హి.స.) గుట్టుచప్పుడు కాకుండా పేకాట

ఆడుతున్న స్థావరం పై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, మఠంపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మఠంపల్లి మండలంలోని బాండవ తండాలోనీ భూక్య హనుమ ఇంట్లో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటి పై రైడ్ చేసి పేకాట ఆడుతున్న అయిదుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 13,000 వరకు నగదు,5 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన వారిలో ఓ మాజీ సర్పంచ్ కూడా ఉన్నట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande