మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు.. పోలీసుల హై అలర్ట్
తెలంగాణ, మంచిర్యాల. 16 ఆగస్టు (హి.స.) మంచిర్యాల జిల్లా లో భారీ వర్షం కురుస్తున్నది. వర్షం కారణంగా వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, ప్రాణహిత నదిలోకి కొత్తగా నీరు వచ్చి చేరుతుండడంతో నదులలో ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. కాగా భారీ
భారీ వర్షాలు


తెలంగాణ, మంచిర్యాల. 16 ఆగస్టు (హి.స.)

మంచిర్యాల జిల్లా లో భారీ వర్షం కురుస్తున్నది. వర్షం కారణంగా వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, ప్రాణహిత నదిలోకి కొత్తగా నీరు వచ్చి చేరుతుండడంతో నదులలో ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. కాగా భారీ వర్షాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు నదుల వైపు చేపల వేటకు వెళ్లకూడదని.. నదులు, వాగులు, చెరువులు, కుంటలు, ఒర్రెలు దాటే ప్రయత్నం చేయకూడదని సూచించారు. విద్యుత్ ప్రమాదాల ముప్పుపొంచి ఉండటంతో విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లకు దగ్గరగా వెళ్లవద్దని, పశువుల కాపరులు పశువులతో అడవులు, వాగులు దాటి వెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు.

మట్టి గోడలు, పాత ఇండ్లు, శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివసిస్తున్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలలో ఉండాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీస్లను సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, పుకార్లను నమ్మకుండా అధికారుల సూచనలు పాటించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande