కామారెడ్డి జిల్లాలో కారు ప్రమాదం.. ఐదుగురికి తీవ్ర గాయాలు
కామారెడ్డి, 16 ఆగస్టు (హి.స.) అడ్డుగా వస్తున్న కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడి డ్రైవర్ తో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బీటీఎస్ సమీపంలోని 44వ హైవే పై శనివారం వేకువజామున చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే నిజా
కారు యాక్సిడెంట్


కామారెడ్డి, 16 ఆగస్టు (హి.స.)

అడ్డుగా వస్తున్న కుక్కను

తప్పించబోయి కారు బోల్తా పడి డ్రైవర్ తో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బీటీఎస్ సమీపంలోని 44వ హైవే పై శనివారం వేకువజామున చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలానికి చెందిన ఎం.రాజశేఖర్ ఉపాధి కోసం ఖత్తర్ దేశానికి వెళ్ళాడు. ఆయన స్వదేశానికి తిరిగి వస్తుండడంతో శుక్రవారం అర్థరాత్రి, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ దిగిన ఆయనను రిసీవ్ చేసుకుని, స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు పలువురు కారులో బయలుదేరారు. తిరిగి వస్తుండగా కుక్క కారుకి అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి కారు బోల్తా పడింది. దీంతో కారులోని ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande