దిల్లీ, 16 ఆగస్టు (హి.స.): సుప్రీం కోర్టు, హైకోర్టులు ర్యాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైనవేనని రెండూ సమానమైన ప్రాధాన్యం కలిగి ఉంటాయని ఏ ఒక్కటీ మరోకదానికంటే ఉన్నతమైనది కాదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. న్యాయమూర్తి పదవికి నిర్దిష్ట వ్యక్తి పేరును సిఫారస్సు చేయాలంటూ హైకోర్టును సుప్రీం ఆదేశించలేదని స్పష్టం చేశారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) నిర్వహించిన కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ గవాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులను, హైకోర్టు న్యాయమూర్తుల పదవి కోసం పరిగణించాలని ఎస్‌సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్.. సీజేఐ జస్టిస్ గవాయ్ ముందు ఓ కీలక ప్రతిపాదనను చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ