79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంస్థ
హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స) దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంస్థ (ఎస్.సి.ఆర్.డబ్లూ.డబ్లూ.ఓ) ఈరోజు ఆగస్టు 15, 2025న సికింద్రాబాద్‌లోని చిలకలగూడలోని విద్యా విహార్ హైస్కూల్ మరియు సికింద్రాబాద్‌లోని లాలాగూడలోని సెంట్రల్ హాస్పిటల్‌లో 79వ స్వాతంత్ర్య ది
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంస్థ


హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స)

దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంస్థ (ఎస్.సి.ఆర్.డబ్లూ.డబ్లూ.ఓ) ఈరోజు ఆగస్టు 15, 2025న సికింద్రాబాద్‌లోని చిలకలగూడలోని విద్యా విహార్ హైస్కూల్ మరియు సికింద్రాబాద్‌లోని లాలాగూడలోని సెంట్రల్ హాస్పిటల్‌లో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంస్థ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి వందన శ్రీవాస్తవ విద్యా విహార్ హైస్కూల్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సంధర్భంగా శ్రీమతి వందన శ్రీవాస్తవ మంచి భవిష్యత్తు కొరకు వున్న అవకాశాలను ఉపయోగించుకుని చదువులో రాణించాలని విద్యార్థులకు సూచించారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోవద్దని కూడా ఆమె సభకు సూచించారు. ఇప్పుడు మన దేశ పురోగతి మరియు అభివృద్ధి భవిష్యత్ తరాల విద్యార్థుల చేతుల్లో ఉందని ఆమె అన్నారు.

దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంస్థ అధ్యక్షురాలు, శ్రీమతి వందన శ్రీవాస్తవ ఇతర కార్యనిర్వాహక కమిటీతో కలిసి లాలాగూడలోని కేంద్రీయ హాస్పిటల్‌ను సందర్శించి, నవజాత శిశువుల తల్లులకు గైనకాలజీ వార్డులో బేబీ బెడ్డింగ్ మరియు హిమాలయ గిఫ్ట్ కిట్‌లను పంపిణీ చేశారు మరియు ఆసుపత్రిలో రోగులకు ఆహారం వడ్డించడానికి 150 స్టీల్ ప్లేట్‌లను విరాళంగా ఇచ్చారు.

(

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande