సంగారెడ్డి జిల్లాలో దంచి కొట్టిన వర్షం.. చెరువులను తలపిస్తున్న ఊర్లు..
సంగారెడ్డి, 16 ఆగస్టు (హి.స.) సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత అర్ధరాత్రి వర్షం దంచి కొట్టింది. దీంతో చెరువులు, కుంటలు, బోరు బావులకు భారీగా నీరు చేరి చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలకు నీరు చేరింది. జిల్లాలోని పుల్కల్ (లక్ష్మీ సాగర్) 13.7 సెంటీ
సంగారెడ్డి వర్షం


సంగారెడ్డి, 16 ఆగస్టు (హి.స.) సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత అర్ధరాత్రి వర్షం దంచి కొట్టింది. దీంతో చెరువులు, కుంటలు, బోరు బావులకు భారీగా నీరు చేరి చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలకు నీరు చేరింది. జిల్లాలోని పుల్కల్ (లక్ష్మీ సాగర్) 13.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా మొగుడంపల్లి 0.73 సెంటీమీటర్ల అతి తక్కువ వర్షపాతం నమోదయింది. ఝరాసంగం వాలాద్రి వాగు పొంగి ఏడాకులపల్లి, ప్యారవరం, ఎల్గోయి, జీర్లపల్లి చెరువు పొంగడంతో మంజీరాకు వరద నీరు వెళుతుంది. ప్యారవరం వాగు ఎప్పటి మాదిరిగానే పొంగిపొర్లుతోంది. కుప్పానగర్, మచ్నుర్, కృష్ణాపూర్, బర్దిపూర్, జీర్లపల్లి, ఝరాసంగం, కక్కెర వాడ, చిలేపల్లి, చిలపల్లి తండా, దేవరంపల్లి, ఈదులపల్లి, మేదపల్లి, ఏడాకులపల్లి, కృష్ణాపూర్ తదితర గ్రామాల్లో వర్షం దంచి కొట్టింది. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి నుంచి బర్దిపూర్ శివారు వరకు ఉన్న జాతీయ పెట్టుబడి రహదారికి ఇరువైపులా పంట పొలాల్లో భారీగా నీరు చేరింది. పంట పొలాలు వాగులను తలపిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande