హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం
సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీసీఎస్ సిట్ విచారణలో భాగంగా ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్సేషన్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను నేరం చేసినట్లుగా విచారణలో డాక్టర్ నమ్రత ఒప్పుకుంది. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనగోలు చేసినట్లుగా తెలిపింది. తమ దగ్గరికి వచ్చిన దంపతుల వద్ద సరోగసి పేరిట రూ.30 లక్షల వరకు వసూలు చేశామని స్టేట్మెంట్ ఇచ్చింది. అదేవిధంగా అబార్షన్ కోసం వచ్చే గర్భిణులను డబ్బు ఆశ చూపామని.. ప్రసవం అయ్యాక వారి నుంచి పిల్లలను కొనుగోలు చేసినట్లుగా తెలిపింది. అలా ఎంతోమంది పిల్లలు లేని దంపతులను మోసం చేశామని.. సరోగసి ద్వారానే పిల్లలను పుట్టించినట్లుగా నమ్మించామని డాక్టర్ నమ్రత వాంగ్మూలం ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..