సంక్షేమ అభివృద్ధి సుపరిపాలన సాగిన ఏడాదిలో ఎంతో.సంతృప్తికరం అని.సీఎం.చంద్రబాబు అన్నారు
అమరావతి, 16 ఆగస్టు (హి.స.) : సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలుకాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ప్రధాన ఎన్నికల హామీలుగ
मुख्यमंत्री चंद्रबाबू,उप मुख्यमंत्री पवन कल्याण और राज्य मंत्री लोकेश ,चित्र में


पुलिवेंदुला और ओन्टिमिट्टा उमीदवार


అమరావతి, 16 ఆగస్టు (హి.స.)

: సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలుకాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్‌ సిక్స్‌ను సూపర్‌ హిట్‌ చేశామని ప్రకటించారు. శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలోని తెలుగువారందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు. అభివృద్ధికి అడ్డులేదు.. సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డు.. ఇదే ఆల్‌టైం రికార్డు’గా అభివర్ణించారు. ఎన్టీఆర్‌ భరోసా కింద 64 లక్షల మందికి ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేస్తూ సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్ని ఇచ్చామన్నారు. పేదింటి తల్లులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు రూ.10వేల కోట్లతో తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చామన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో మొదట విడతగా రాష్ట్రప్రభుత్వం రూ.5వేలు, కేంద్రం ఇచ్చిన రూ.2వేలు కలిపి మొత్తం రూ.7వేల చొప్పున రూ.3,173 కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. దీపం పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, రూ.2,684 కోట్లు ఖర్చుతో 2కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ‘స్త్రీశక్తి’ పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుకగా ఇస్తున్నామని చెప్పారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించామని.. ఈ నెలాఖరుకు నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దుచేశామని గుర్తుచేశారు. 204 అన్న క్యాంటీన్లలో 5.16కోట్లమందికి రూ.5కే కడుపు నింపుతున్నామని చెప్పారు. 6 వేలకు పైగా ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు రూ.10వేల చొప్పున విడుదల చేస్తున్నామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande