హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.) బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న 24 గంటల పాటు ఉరుములతో కూడిన వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జయంశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డితో పాటు సిరిసిల్ల జిల్లాలో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..