వికారాబాద్, 16 ఆగస్టు (హి.స.)
చేవెళ్ల నియోజకవర్గంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటనలో భాగంగా నవాబుపేట మండలంలో మంత్రికి నిరసన తగిలింది. శనివారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య స్వగ్రామం అయిన నవాబుపేట మండలం, చించల్పేట్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ అలాగే అంగన్వాడి కేంద్రం నూతన భవనం ప్రారంభోత్సవంలో భాగంగా మంత్రి సీతక్క పర్యటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వికారాబాద్ జిల్లాను అలాగే చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోవడంలేదని స్థానిక బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పూలపల్లి గేటు దగ్గర మంత్రికి వినతి పత్రం ఇస్తామని బీజేపీ పార్టీ కండువాలు వేసుకొని వస్తుండగా, పోలీసులు వారిని అరెస్టు చేసి వికారాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్