అమరావతి, 16 ఆగస్టు (హి.స.)రాష్ట్రంలోని ఆడబిడ్డలు ఇకనుంచి జీరో ఫేర్ టికెట్‌తో ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ బస్టాండ్‌లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ‘స్త్రీ శక్తి’ ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఉండవల్లి గుహల నుంచి విజయవాడ బస్టాండ్ వరకూ మహిళలతో కలిసి వారంతా ప్రయాణించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు రాష్ట్ర మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం లభించిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 2.62కోట్ల మంది మహిళలు లబ్ధి పొందే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్లర్లను గతంలో తానే నియమించానని, త్వరలో మహిళా డ్రైవర్లు కూడా రాబోతున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో కొనేవన్నీ విద్యుత్ బస్సులేనని, మహిళలు ఆ బస్సుల్ని సులభంగా నడపవచ్చన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రం.’’ అని లోకేశ్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ