రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం, ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చకు అవకాశం
న్యూఢిల్లీ, 16 ఆగస్టు (హి.స.)భారతీయ జనతా పార్టీ (BJP) రేపు (ఆగస్టు 17) న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుత
BJP parliamentary board to meet on Aug 17 discussion likely on Vice Presidential candidate avn


న్యూఢిల్లీ, 16 ఆగస్టు (హి.స.)భారతీయ జనతా పార్టీ (BJP) రేపు (ఆగస్టు 17) న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.

ఆగస్టు 6న జరిగిన పాలక నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నాయకులు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ అభ్యర్థిని ఖరారు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్.. కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు పూర్తి అధికారం ఇస్తూ ఆ తీర్మానాన్ని ఆమోదించారు.

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ (74), జూలై 21, 2025న ఆరోగ్య కారణాలను చూపుతూ తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. ఉపరాష్ట్రపతి తన అధికారిక X ఖాతాలో చేసిన పోస్ట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ సమర్పించారు. ఆ లేఖలో, 'ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడానికి, వైద్య సలహాకు కట్టుబడి ఉండటానికి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(a) ప్రకారం, తక్షణమే అమలులోకి వచ్చేలా భారత ఉపరాష్ట్రపతి పదవికి నేను రాజీనామా చేస్తున్నాను' అని రాశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande