శ్రీశైలం, 16 ఆగస్టు (హి.స.)కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) జురాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఈ క్రమంలో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,61,382 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 1,46,474 క్యూసెక్కులు ఉంది. అలాగే, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగులకు చేరుకుంది. కాగా, ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా పర్యాటకులు శ్రీశైలానికి క్యూకడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి