తెలంగాణ, ఆదిలాబాద్. 17 ఆగస్టు (హి.స.)
భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో నీట మునిగిన పంట పొలాలను ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పలకరించి ధైర్యంగా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నష్టపోయిన ప్రతి గుంట భూమిని రికార్డు చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలన్నారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం అందేలా ఒత్తిడి తీసుకొస్తానని భరోసా కల్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు