తెలంగాణ, ములుగు. 17 ఆగస్టు (హి.స.)
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. మరో రెండ్రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో నేటి నుంచి వాజేడు బొగత జలపాతం పర్యాటకుల సందర్శన నిలిపివేశారు అధికారులు. గత రెండు రోజులుగా పెనుగోలు గుట్టల పై ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు బొగత జలపాతం ప్రమాద స్థాయి దాటి ప్రవహించడంతో బోగత జలపాతం సందర్శన నిలిపివేసిన అధికారులు. అదేవిధంగా రానున్న రెండు రోజులలో వాతావరణ శాఖ ములుగు జిల్లాలో భారీ నుంచి అతివారి వర్షాలు కురుస్తాయని సూచించింది. దీంతో జలపాతానికి భారీగా వర్షపు నీరు చేరే అవకాశం ఉండటంతో పర్యాటకుల రక్షణ చర్యలో భాగంగా బొగత జలపాత సందర్శన నిలిపి వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు